సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూళ్లు సాధించిన బాహుబలి 2 సినిమాను కొట్టే సినిమా ఎప్పుడు వస్తుందా? అని భారతదేశం అంతా ఎదురు గత 6ఏళ్లుగా ఎదురు చూస్తున్న సరే.. అది ఏ హీరోకి గాని, ఏ దర్శకుడికి సాధ్యం కానీ ఫీట్ గానే మిగిలిపోయింది. దాని తరువాత డివైడ్ టాక్ తో.. సాహో 450 కోట్ల వసూళ్లు, రాధే శ్యాం 280 కోట్లు, ఆదిపురుష్ 450 కోట్ల కలెక్షన్స్ దాటి పోవడంతో సినీ విశ్లేషకులు ప్రభాస్ క్రేజ్ కి నోళ్లు వెళ్ళబెట్టారు.. ( నిజానికి భారీ హిట్ సినిమాలకు ఆ స్థాయి కలెక్షన్స్ కష్టమే.. .. మరి పాన్ ఇండియా సినిమాలలో “ఎవరెస్టు” హీరో ప్రభాస్ కు అ కలెక్షన్స్ చాల తక్కువ..) మొత్తానికి మరల హీరో ప్రభాస్ ఈసారి సలార్ గా బాహుబలి 2 స్థాయి సినిమా తో వచ్చాడని .. గత 3 రోజులుగా దేశం అంతా కుదిపేస్తున్న” సలార్ ” ప్రభంజనం నిరూపిస్తుంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 178 కోట్లు వసూళ్లు సాధిస్తే,2వ రోజుకు 295 కోట్లు సాధిస్తే నేడు, ఆదివారం 3వ రోజుతో కలపి అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తీ అయ్యాయి కాబ్బటి సుమారు 400 కోట్ల వసూళ్లు కు చేరుతుందని అంచనా. భీమవరంలో 11 థియేటర్స్ లో ప్రదర్శిస్తున్న 3 రోజులకు కలపి 65 లక్షలు పైగా వసూలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ నిబంధనలు మేరకు బెనిఫిట్ షో.. అదనపు టికెట్స్ రేట్స్ రద్దు చేసారు కానీ మొదటి రోజే 65 లక్షల గ్రాస్ కలెక్షన్స్ తో బాహుబలి 2 రికార్డు కు ఎసరు పెట్టేసేవాడు సలార్. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సలార్ 3 రోజులకు 4న్నర కోట్లు కలెక్షన్ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. మరి సలార్ కు ఒక రోజు ముందు రిలీజ్ అయిన షారుక్ ఖాన్ సినిమా డింకీ మొదటి రోజు 55 కోట్ల కలెక్షన్ మినహా మొత్తం 4 రోజులుకు 100 కోట్ల కలెక్షన్స్ దాటటమే కష్టంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *