సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం లో పలు ప్రాంతాలలో ముఖ్యముగా రూపాంతరం దేవాలయం , లూధరన్ చర్చి, దాగరపు చర్చి, గునుపూడి చర్చి, బేతని చర్చి, సేంట్ మేరీస్ చర్చి , చిన్నపేట చర్చి, తాడేరు రోడ్డు చర్చి తదితర భారీ చర్చిలలో వేలాది జనుల మధ్య గత గత ఆదివారం రాత్రి నుండి నేటి ఆదివారం ఉదయం వరకు ఏకబిగిగా దేవుని పుత్రుడు అయిన ఏసు నామాన్ని స్తుతిస్తూ సంగీత విభావరీలు,, క్రీస్తు జన్మదినం సందర్భముగా ఈ లోకానికి ఆహ్వానిస్తూ కీర్తనలు, నాటికలు మత పరమైన సాంస్కృతిక ప్రదర్శనలు క్రైస్తవుల ప్రార్థనలు నిర్వహించారు.చర్చి లను విద్యుద్దీపాలు, క్రిస్మస్ ట్రీలతో అందంగా అలంకరించారు. చిన్నా పెద్దా శాంటాక్లాజ్ వేషధారణలతో సందడి చేస్తూ కనిపించారు. పలు ప్రార్థనా మందిరాల్లో క్రీస్తు జననాన్ని వివరించేలా బొమ్మలతో క్రొవొత్తుల వెలుగులో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి నేటి సోమవారం ఉదయం పట్టణం అంతటా సందడిగా ఉంది. క్రైస్తవులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. చర్చి లలో పాస్టర్ లు బైబిల్ సూక్తులు వివరిస్తూ జనుల కోసం ప్రార్ధనలు చేసారు.
