సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో ప్రక్క. పలు ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధ సంస్థలలో ఉద్యోగులు తమ డిమాండ్స్ ను ప్రభుత్వం దృష్టికి తేవడం చూస్తూనే ఉన్నాం.. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బంది, మరియు రెగ్యులర్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల27న చేయనున్న రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మె ను జనవరి 6వ తేదీకి వాయిదా వేసినట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చలసాని వెంకట రామారావు ప్రకటించారు. ఏలూరులోని స్ఫూర్తి భవన్ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *