సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అన్న చెల్లెళ్ళ మధ్య విభేదాలు తారాస్థాయి కి చేరుకొన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగనన్న వదిలిన బాణంగా చెప్పుకొని ఆయన సోదరిగా వై ఎస్ షర్మిల ఏపీలో వైసీపీ పార్టీ కి తన పాదయాత్రతో గతంలో ఎంతటి బూస్ట్ ఇచ్చిందో వైసిపి నేతలు ఎవరు మరువలేరు. అయితే సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక అన్నతో విభేదాలు ఉన్నప్పటికీ, గౌరవ ప్రదంగా తెలంగాణ వైసీపీ పార్టీ పెట్టిన ఆమె సత్తా ను అందరు హర్షించారు. అయితే అక్కడ రాజకీయాలలో రాణించలేక కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి ఎన్నికలలకు దూరంగా నిలబడిన వై ఎస్ షర్మిల మరల ఏపీ రాజకీయాలలో ద్రుష్టి పెట్టినట్లు దానికి కేంద్ర కాంగ్రెస్ నేతల నుండి ప్రోద్భలం ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా క్రిస్మస్ను పురస్క రించుకుని ఏపీ రాజకీయాలలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కి చంద్రబాబు రాజకీయ బద్ద శత్రువు అయితే ఏపీలో సీఎం జగన్ అన్న కు రాజకీయ ప్రత్య ర్థి, బద్ధ శత్రువైన నారా లోకేశ్‌కు షర్మిల వై యస్ కుటుంబసభ్యుల కానుకలు అంటూ .. స్పెషల్ గిఫ్ట్స్ పంపడం .. దానికి ప్రతిగా నారా లోకేష్ మా నారావారి కృతజ్నతలు స్వీకరించాలని ట్విట్ పెట్టడం.. వై వైస్ అభిమానులు వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేని విషయం. ఈ చర్యతో జగన్‌తో తనకెలాంటి సంబంధాలు లేవని షర్మిల బహిరంగ సంకేతాలు పంపినట్లయింది. అన్న జగన్‌తో ఆస్తి పంపకాలకు సంబంధించి తీవ్ర విభేదాలున్నాయనే ప్రచారం లో భాగంగా షర్మిల మరి ఇంతగా తెగిస్తుందా? తండ్రి వై యస్ నేర్పిన కుటుంబ విలువలకు అన్న చెలెళ్ళు లో ఎవరు త్రిలోకాలు ఇస్తున్నారో కానీ మధ్యలో తల్లి విజయమ్మ నలిగిపోతుంది అని సన్నిహితులు వాపోతున్నారు. త్వరలో కర్ణాటక నుండి రాజసభ కు షర్మిలను కాంగ్రెస్ ఎంపీ గా ప్రమోషన్ ఇచ్చి ఏపీ కి కాంగ్రెస్ అడ్జక్షరాలిగా ప్రకటిస్తారని వస్తున్నా వార్తలకు ..ఇటీవల తెలంగాణ ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో ఏపీలో కూడా కాంగ్రెస్ తో మరోమారు లోపాయకారి ఒప్పందం తో టీడీపీ వెళ్లే అవకాశం ఉండటంతో షర్మిల వేసిన రాజకీయ పాచిక గా ఈ లోకేష్ కు పంపిన గిఫ్ట్ గా భావించాలా? లేక భవిషత్తు రాజకీయాలలో ఎత్తుల కోసం అన్న చెల్లెలు లోపాయకారి గా చేసుకొన్నా పూహ్యం మా ? ఏదయినా కావచ్చు..కాకపోతే మొత్తం ఎపిసోడ్ లో తెలంగాణ లో జరిగిన డామేజ్ తో పాటు తమ కుటుంబనికి రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపిన షర్మిల కు జరిగే నష్టం నైతికంగా ఎక్కువగా కనపడుతుంది.. సిగ్మా ప్రసాద్ కాలమ్స్..
