సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పండుగ తరువాత టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా కేటాయించిన సీట్ల ను అధికారికంగా ప్రకటిస్తారు. నిజానికి ఇప్పటికే 18 మంది జనసేన అభ్యర్థుల లిస్ట్ .. నియోజక వర్గాలు సిద్ధం అవ్వడం తో ( ఆ లిస్ట్ మన సిగ్మా న్యూస్ లో 2 వారాల క్రితమే ప్రకటించాము భీమవరం నుండి పవన్ కళ్యాణ్.. అందులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు..) ఆయా అభ్యర్థులను జనంలోకి వెళ్లి ఎన్నికల కార్యాచరణ ప్రారంభించాలని పవన్ కళ్యణ్ ఇప్పటికే అనధికారికంగా ఆదేశాలు జారీ చేసారు. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి లోని కాకినాడ కేంద్రంగా ఈ నెల 28,29,30 తేదీల్లో మూడు రోజులపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ సమీక్ష నిర్వహించనున్నారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలపై సమీక్ష.. పర్యటన నేటి మంగళవారం సాయంత్రంలోగా షెడ్యూల్ ఖరారు కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *