సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు నేడు, మంగళవారం మీడియాకు విడుదల చేసిన లేఖలో పలు విషయాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో అంగన్ వాడి, ఆశ , మున్సిపల్ సిబ్బంది తమ డిమాండ్లతో సమ్మెలకు దిగుతున్నారని, దీనికి తోడు వాలంటీర్లు కూడా సమ్మె కు దిగుతుండటంతో అధికార వైసీపీ ఇరకాటంలో పడిందని అన్నారు. సేవ చేయడానికి ముందుకు వచ్చారని , వారికి గౌరవ వేతనాన్ని 5000 రూ. ఇస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించగా.. ఇప్పుడు వాలంటీర్లు 18000 అడుగుతున్నారని, దీనితో డెఫినిట్ గా వాలంటీర్ వ్యవస్థ అనేదే ఉండదు. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థను చూసుకొని, పార్టీ క్యాడర్ ని దూరం చేసుకున్నారు. ప్రజలకు, పార్టీకి మధ్య వారదులుగా వాలంటీర్లను పెట్టుకున్నారు. ఇప్పుడు వాలంటీర్లు డబ్బులు అడుగుతున్నారు. ప్రజలపై పన్నులు వేసి, వాలంటీర్లకు ఖర్చు పెడతామంటే ?వాలంటీర్ వ్యవస్థ అవసరమా అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. భీమవరంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వందల యేళ్ళనాటి ఎపుగా ఎదిగిన చెట్లను నేలమట్టం చేస్తున్నారు. చెట్లను నరికి వేసిన వార్తలు వారి దినపత్రికలో ప్రచురించే ఛాన్సే లేదు. మిగతా దినపత్రికలలో ప్రచురించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ వార్తలను చూడరు. ముఖ్యమంత్రికి తెలియకుండానే, అధికారులే చెట్లను నరుకుతున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. చెట్లను నరకడం ద్వారా సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఈ మూడు నెలలైనా అధికారులు చెట్లను నరికి వేయడం మానివేయాలన్నారు. లేకపోతే ప్రజలు క్షమించారని హెచ్చరించారు. లూథరన్ గ్రౌండ్ లో ఎంతో మంది దేశప్రముఖులు హెలికాఫ్టర్ లో దిగి బహిరంగ సభల్లో ప్రసంగిస్తే అడ్డు రాని పురాతన వృక్షాలు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ప్రయాణానికి అడ్డుగా ఉన్నాయనో, జనం ఆయన్ని చూడడానికి అడ్డుగా ఉన్నాయనో, దేనికి చెట్లను నేలమట్టం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *