సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా టెక్సాస్‌లో తాజగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అమలాపురానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు దుర్మరణం చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ముమ్మిడివరం వైసిపి ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ సొంత చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబసభ్యులు. నాగేశ్వరరావు చిన్న కుమార్తె నవీన గంగ, అల్లుడు లోకేష్‌తో పాటు ఇద్దరు పిల్లలు టెక్సాస్‌లో ఉంటున్నారు. 6 నెలల క్రితం అమలాపురం వచ్చిన కుమార్తె నవీనతో కలిసి తండ్రి నాగేశ్వరరావు, తల్లి సీతామహాలక్ష్మి ఇటీవల టెక్సాస్‌కు పయనమయ్యారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ( ఫై తాజా చిత్రంలో చూడవచ్చు )ప్రమాదంలో నాగేశ్వరరావు, సీతామహాలక్ష్మి, కుమార్తె నవీనతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందగా.. నాగేశ్వరరావు అల్లుడు లోకేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కుటుంబసభ్యుల మృతితో అమలాపురంలో ముమ్మిడివరంలో వారి సన్నిహితుల కుటుంబాలలో విషాదం నిండుకొంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *