సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క మరో 3 నెలలు తరువాత దేశంలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ‘ఆసేతు హిమాచలం’ ‘పెట్రోలు మొదలుకొని ఉప్పు‘ వరకు అన్ని ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి ప్రజలకు బ్రతుకు దెరువు తేలడం లేదు. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ రాబోయే నిశబ్ద విప్లవాన్ని గుర్తించింది. అందుకే దేశంలో ముఖ్యంగా ఉత్తరాదిన ఆహార పదార్థాలను సామాన్యులకు అందుబాటు ధరల్లో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘భారత్ ’ బ్రాండ్ పేరుతో రూ.60కే కిలో శనగపప్పు , రూ.27.50కే కిలో గోధుమ పిండి ని విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సన్న బియ్యం రిటైల్ మార్కెట్ లో కేజీ 60 రూపాయలకు తక్కువ ఎక్కడ లేదు. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో సగటున కిలో బియ్యం ధర క్రితం ఏడాదితో పోలిస్తే 14.1శాతం పెరిగింది. అందుకే ధరలు అదుపులోకి తేవడానికి ఇక నుంచి బియ్యాన్ని కూడా త్వరలోనే ‘భారత్ రైస్ పేరుతొ కిలో బియ్యాన్ని రూ.25కే విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం . నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్, మొబైల్ వ్యాన్ల ద్వారా రాయితీ ధరకు బియ్యం విక్రయాలు ప్రారంభిస్తారని సమాచారం.. దీనితోనన్న బహిరంగ మార్కెట్ లో బియ్యం ధరలు దిగివస్తాయని సామాన్యులు ఆశ పడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *