సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల స్థిరాస్తులకు నష్టం కలిగించే విధంగా తీసుకువచ్చిన ACT 27 OF 2023 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భీమవరంలో లాయర్స్ (BAR) అసోసియేషన్ తరఫున చేస్తున్న రిలే నిరాహారదీక్షకు జనసేన పార్టీ సభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భముగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు&భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి కొటికలపూడిగోవిందరావు మాట్లాడుతూ.. రాబోయే మన టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల ప్రభుత్వంలో ఈ చట్టాన్ని రద్ధు చేస్తాం అని హామీ ఇచ్చి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు చెనమల్ల చంద్రశేఖర్,సుంకర రవి, బండి రమేష్ కుమార్, మోకా శ్రీనివాస్ , కత్తుల నీలెంద్ర, వబిలిశెట్టి రామకృష్ణ, మాగపు ప్రసాద్,నాగిడి ఏడుకొండలు ,రామాయణం శ్రీను, కాళీ శేఖర్ తుంపాల శ్రీను, సామనగిరి, రెడ్డి సత్తిబాబు, శ్యామల, తదితరులు పాల్గొన్నారు
