సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మృత్యు భయం ఉన్నవారికి మహాదేవుని రక్షణ కల్పించే దక్షిణ కాశీగా పిలవబడే భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో స్కంద పురాణం ప్రకారం యమధర్మ రాజుచే ప్రతిష్ట కావింపబడిన .. స్వయం భువుడుగా వెలసిన శ్రీ పార్వతీ సమేత శక్తిశ్వర స్వామివారి రాజగోపుర శిఖర ప్రతిష్ట నేడు, శనివారం అత్యంత వైభవంగా జరిగింది. విశేషంగా భక్తులు ఈ పుణ్య కార్యక్రమానికి హాజరై హర హర హర హర మహాదేవ శంభో శంకర ‌అంటూ శివనామ స్మరణ జరిపారు. రాజగోపుర శిఖర ప్రతిష్టతో పాటుగా మహా కుంభాభిషేకాన్ని కూడా జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక హోమాలను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పుణ్య కార్యక్రమములో తాము కూడా భాగస్వాములు కావడం తమ పూర్వజన్మ సుకృతం అని గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఈ ప్రత్యేక పూజల్లో వారి తనయుడు గ్రంధి రవితేజ కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *