సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో వేంచేసియున్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60వ వార్షిక జాతర మహాత్సవములు ఈ నెల 13వ తేదీ నుండి 28 రోజుల పాటు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు, ఆదివారం సాయంత్రం శ్రీ అమ్మవారి ఆలయ ప్రాంగణములో స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్, గ్రంధి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా, భీమవరం రెవిన్యూ డివిజినల్ అధికారి కె. శ్రీనివాసులు రాజు అధ్యక్షతన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశము నిర్వహించి వివిధ శాఖ అధికారులతో సమీక్షా చెయ్యడం జరిగింది. ఈ సందర్భముగా ఉత్సవ నిర్వాహకులు నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం సభ్యులను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అభినందించారు. నాటకాల కళాకారులకు పోత్సాహం ఇస్తున్నారని అన్నారు. అయితే ఇక్కడ పెద్ద స్థాయిలో ఉత్సవాల నిర్వహణకు , వేలాదిగా వచ్చే భక్తులకు దేవాలయ ఆవరణలో స్థలం సరిపోవడం లేదని అభిప్రాయపడ్డారు.దీనికో పరిష్కరం చూడాలని అన్నారు, ఈ కార్యక్రమములో DSP, మున్సిపల్ శాఖ,, మండల రెవిన్యూ ఎ.పి.యస్.ఆర్.టి.సి, అధికారులు, భీమవరం, నీరుల్లి కూరగాయ పండ్లవర్తక సంఘం మరియు ఉత్సవ కమిటీ వారు, ధర్మకర్త మండలి సభ్యులు, చైర్మెన్ మానేపల్లి నాగేశ్వర రావు, దేవాలయ సహాయ కమిషనర్ , ఈఓ యర్రంశెట్టి భద్రజీ తదితరులు పాల్గొన్నారు.
