సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంత్రి ఆర్కే రోజా టీడీపీ జనసేన పై నేడు, సోమవారం తీవ్ర స్థాయిలో విమర్శ లు చేశారు. వడమాలపేట మండల పరిషత్ కార్యాలయంలో నూతన పెన్షన్ పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా మాట్లాడుతూ.. ఏపీ ప్రజలను దోపిడీ చెయ్యడానికి అధికారం చెలాయించడాన్ని కోసం పొత్తులు పెట్టుకొని ఆంధ్ర ప్రదేశ్ లో పోటీ చెయ్యడానికి ప్రక్క రాష్ట్రము తెలంగాణ నుండి గుంపులు గుంపులుగా వచ్చే పార్టీల నాయకులను హైదరాబాద్ కు తరిమి కొట్టండని ప్రజలకు పిలుపు ఇచ్చారు. . వాళ్లు అందరూ కూడా నాన్ లోకల్ పొలిటిషియన్స్ అని తెలిపారు. చంద్రబాబుకి, పవన్ కల్యాణ్, లోకేష్ కి ఆంధ్ర ప్రదేశ్ లో సొంత ఇల్లు గానీ, ఓటు గాని లేదని మం త్రి రోజా పేర్కొన్నారు. ఇప్పుడు ఏపీలో ఎన్నికల కోసం స్థానికంగాకొత్తగా ఓట్లు హక్కు పెట్టుకుంటున్నారని ఇప్పటి వరకు హైదరాబాద్ లోనే ఓటు వేశారని ఆరోపించారు. చంద్రబాబు ఫ్యామిలీ గానీ, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గానీ ఏపీలో ఉన్నారా? అని మం త్రి రోజా ప్రశ్నించారు. చుట్టపు చూపుగా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పైన జగనన్న మీద విషం చిమ్మి .. మమ్మ ల్నిఅందరినీ బూతులు తిట్టడం తప్ప వాళ్ళ కి ఏమీ తెలుసు? అని విమర్శించారు.ఏపీలో సీఎం జగన్ మాత్రమే ప్రజల మనిషి.. అని మం త్రి రోజా వ్యాఖ్యానించారు.
