సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు,మంగళవారం విజయవాడలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన సీఈసీ బృందాన్ని కలిశారు. వారికీ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరులో తమకున్న అనుమానాలను, రాష్ట్ర ప్రభుత్వం అధికారులను బెదిరిస్తుందని పలు పిర్యాదులు చేసిన తదుపరి మీడియా సమావేశంలో ఇరువురు నేతలు అధికార వైసిపి నేతలపై తమ అనుమానాలను ఏకరువు పెట్టారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ఇటీవల తెలంగాణాలో ఎన్నికలు చక్కగా జరిగాయని.. అయితే ఏపీలో మాత్రం నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు…రాష్ట్రంలో ఇన్ని అక్రమాలు జరిగిన సందర్భమే లేదని, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని చంద్రబాబు అన్నారు. జగన్ సర్కార్ అధికారాన్ని దుర్వినియోగం చేసి దొంగ ఓట్లు చేర్చారని, ఆధారాలతో సహా దొంగ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. మహిళా పోలీసులను బీఎల్వోలుగా పెట్టారని, టీడీపీ – జనసేన పార్టీల ఫై మరియు క్యాడర్ ఫై 7 వేల అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..14 ఏళ్ళు సీఎంగా చేసిన చంద్రబాబే ఇటువంటి ఎన్నికల అక్రమాలు చూడలేదని అంటున్నారంటే పరిస్థితి ఎంతదారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చునని అన్నారు. ఏపీలో ఎన్నికలు సజావుగా జరగాలని కేంద్ర ఎన్నికల సంఘం వచ్చిందని, వైసిపి వాళ్ళు 1/4 దొంగ ఓట్లు చేర్చారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయన్నారు.వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరం పెట్టమని సీఈసీని కోరామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *