సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: క్రికెటర్ గా అంబటి రాయుడు ఎంత దూకుడుగా ఉంటాడో .. ఎన్ని వివాదాల మధ్య మంచి ఫామ్ లో ఉండగానే అంతే వేగంగా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడో, అందరికి తెలుసు.. ఇప్పుడు అంతకు మించిన వేగం ఏపీ రాజకీయాలలో చూపిస్తున్నాడు. కేవలం 10 రోజులు క్రితం వైసీపీలో చేరిన అంబటి రాయుడు 3 రోజుల క్రితం రాజీనామాచేసి తాజగా నేడు, బుధవారం జనసేన లో చేరుతున్నట్లు భావిస్తున్నారు… 2 రోజుల క్రితం బాంబే జట్టు కు ఆడుతున్నానని చెప్పి వైసీపీ పార్టీ కి రాజీనామా చేసినట్లు చెప్పి,కాకలుతీరిన రాజకీయనేతలకే అందని రీతిలో తన ప్రతి బాల్ సిక్స్ కొట్టాలని తపిస్తునట్లు ఉన్నాడు. విషయంలోకి వస్తే.. నేడు, బుధవారం మధ్యాహ్నం మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో గంట పాటు భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్‌తో భేటీ కావడంతో జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు జిల్లా నుండి ఎదో ఒక అసెంబ్లీ సీటుకు అంబటి రాయుడు జనసేన అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగే ఒప్పదం ఫై పవన్ నుండి హామీ పొందే ప్రయత్నం చేసినట్లు? తెలుస్తుంది.. అంబటి రాయుడు చేరికతో జనసేనకు మరింత ఊతం ఇస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
