సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికలు సమీపిస్తున్న వేళా చంద్రబాబుకు భారీ ఉపశమనం లభించింది. నేడు, బుధవారం ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కు హైకోర్టు లో 3 కేసులలో ఒకేసారి ముందస్తు బెయిల్ లభించింది. ఈ మేరకు హైకోర్టు న్యా యమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దర్యా ప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్), ఇసుక, మద్యం వ్యవహారాల్లో మాజీ సీఎం చంద్రబాబు అవినీతి అక్రమాలుకు పాల్బడ్డారని ఏపీ సీఐడీకేసులు నమోదు చేసింది. ఈకేసులలో తనకు ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యా యస్థానం లో ఆయన 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు నేడు తన నిర్ణయాన్ని ప్రకటించింది.అలాగే మద్యం స్కాం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీం ద్ర, రిటైర్ ఐఏఎస్ నరేశ్ కు కూడా ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది.
