సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొత్తానికి సంక్రాంతి పండుగకు ముందే పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పరిధిలో నిరవధిక సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మి కులు నేటి గురువారం నుంచి విధుల్లో చేరేందుకు అంగీకరించారని సమాచారం. నాలుగు రోజుల క్రితం జరిగిన చర్చల్లోఅన్ స్కిల్డ్, స్కిల్డ్ శ్రామికులకు ఒకే తరహా వేతనాలు మినహా, మిగిలిన అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రుల బృందం హామీ ఇచ్చింది. గత బుధవారం మరోసారి సచివాలయం లో విద్యా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇతర ఉన్నతాధికారులు కార్మికసంఘాల నేతలతో సమావేశమయ్యా రు.అలాగే గతంలో చనిపోయిన శ్రామికుని కుటుంబాలకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంపును కూడా అంగీకరించింది. కాల్వలు, బాత్రూం క్లీనర్స్ , సీవరేజ్, గార్బేజ్ సిబ్బంది, మలేరియా వర్కర్స్ వంటి 10 కేటగిరీల సిబ్బందికి ప్రస్తుతం ఇస్తున్న రూ.15 వేలు వేతనం , రూ.6 వేల అలవెన్సు మొత్తం రూ.21 వేలను ఒకేసారి వేతనంగా ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అండర్ గ్రౌండ్ గ్రైనేజీ కార్మికులు, డ్రైవర్లకు 18,500 వేతనం , రూ.6 వేలు అలవెన్సు లు కలిపి రూ.24,500 ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు.
