సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీశైలం మహాక్షేత్రంలో రేపు శుక్రవారం ఉదయం 8.30 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడుతున్నారు. దీనితో నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జిత సేవలు నిలుపుదల చేస్తున్నట్లు ఈవో పెద్ది రాజు తెలిపారు. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18న ముగుస్తాయని, ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి మల్లికార్జునస్వామికి ఏటా రెండు సార్లు.. సంక్రాంతికి, శివరాత్రికి దేవస్థానం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని, బ్రహ్మోత్సవాల భాగంగానే శ్రీస్వామి అమ్మవార్లకు ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించనున్నట్లు, విశేషంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవోపెద్ది రాజు తెలిపారు.
