సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సంక్రాంతి సంబరాలు కు అదనపు ఆకర్షణ గ నెల రోజులు పాటు జరిగే భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 60 వ వార్షికోత్సవాలు నేటి శనివారం ఉదయం ప్రత్యేక పూజలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా నేటి మధ్యాహ్నం ఒంటిగంటకు స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి శ్రీ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి నగరోత్సవం కు వాహనం మీదకు ఆహ్వానం పలికారు. ఈసారి వాహనం ముందు హంసకు బదులుగా శ్రీ వినాయక పుష్ప అలంకరణ సరికొత్తగా ఉంది. మేళ తాళాలతో పట్టణ ప్రధాన వీధుల గుండా అంగరంగ వైభంగా నగరోత్సవం ను ప్రారంభించారు. తీన్మార్ వాయిద్యాలు, మేళతాళాలుతో, గరగల ఘట్టాలతో కళాకారుల నృత్యాలు భారీ బాణాసంచా కాల్పులతో , అసలే సంక్రాంతి పండుగ కొనుగోళ్ళకు దూరప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులు వాహనదారులతో పట్టణ వీధులు కిక్కిరిసిపోయి ఉన్నాయి. వారందరికీ కూడా పుర ప్రజలతో పాటు శ్రీమావుళ్ళమ్మవారి ఉత్సవ విగ్రహం దర్శనం అస్సిసులు అందుకొనే భాగ్యం దక్కింది. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం సభ్యులు, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నేటి సాయంత్రం కి శ్రీ మావుళ్ళమ్మవారి నగరోత్సవం తిరిగి దేవాలయానికి చేరుకొంటుంది. నేటి రాత్రి నుండి అందమైన లైటింగ్ అలంకరణలు చలువ పందిళ్ళ నడుమ ఆధ్యాత్మిక, నాటక, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో రామాయణం గోవిందరావు మరియు ఉత్సవకమిటీ సభ్యులు, ధర్మకర్తల మండలి సభ్యులు , చైర్మెన్ మానేపల్లి నాగన్న బాబు , ఆలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ పాల్గొన్నారు,
