సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శివారు ఉండి పరిధిలోని పెద్దమిరం లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సంక్రాంతి పండుగ కు సుమారు 4 ఏళ్ళ తరువాత నివాసానికి రావడంతో ఆయనను కలవడానికి పలువురు ప్రముఖులు వస్తున్నారు. ఇదే హడావిడి అదనుగా ఒక దొంగ..లేదా దొంగలు ఎంపీ ఇంటి ఎదురుగ పార్క్ చేసి ఉన్న కారు అద్దం పగులగొట్టి రూ.4.5 లక్షల నగదు ఎత్తుకెళ్లిపోయారు అని సమాచారం. పోయిన నగదు పెనుమంట్ర మండలం ఆలమూరుకు చెందిన శ్రీనివాసరాజుదిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ధ్వంసమైన కారును పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎంపీ రాక సందర్భముగా ఆయన భద్రత నేపథ్యంలో ఆయన కార్యాలయం నిర్వాహకులు తాజాగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీ దోషులను పట్టుకోవడానికి పోలీసులకు ఉపయోగపడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *