సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్ నేడు, ఆదివారం ఉదయం రాజధాని ప్రాంతం లో జరిగే భోగిమంటల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగున్నర ఏళ్లగా జగన్ ప్రభుత్వ జీవో కాపీలను భోగి మంటల్లో దహనం చేశారు. ఎన్నికల బరిలో సంయుక్తంగా బరిలోకి దిగుతున్నాము అని దానికి సంకేతంగా కోడి పుంజులతో ఫొటోలు దిగారు. కాగా మూడు రోజులపాటు ‘రా కదలిరా’ కార్యక్రమానికి టీడీపీ, జనసేన పార్టీలు పిలుపు నిచ్చాయి. చంద్రబాబు పవన్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. కాగావిశ్వసనీయ సమాచారం ప్రకారం… సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు, జగన్‌ సర్కారుపై ఉమ్మడిగా పోరాటం, ఉమ్మడిగా పోటీ, ఉమ్మడి మేనిఫెస్టో.. ఒకే బాటగా ముందుకు సాగాలని టీడీపీ, జనసేన నిర్ణయించుకున్నాయి. నిజానికి గత శనివారం రాత్రి 8గంటల కే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్‌ వెళ్లారు. సుమారు మూడున్నర గంటలపాటు ఇరువురు నేతలు భేటీ అయ్యారు. రాత్రి అక్కడే విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నారా లోకేశ్‌,నాదెండ్ల మనోహర్‌ కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *