సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల గుంటూరు కారం సినిమాకు దాని బడ్జెట్ దృష్ట్యా ఏపీ ప్రభుత్వం టికెట్ ఫై అదనంగా 50 రూపాయలు పెంచుకోవడానికి అలాగే తెలంగాణ లో కాకుండా ఏపీలో గుంటూరు లో ప్రమోషన్ పంక్షన్ పెట్టుకోవడానికి అనుమతినివ్వడంతో మహేష్ బాబు భార్య నమత్రా ఇటీవల ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞలు ఆయన వీడియో క్లిప్స్ జతచేస్తూ తెలుపుతూ ట్విట్ చేసిన విషయం అందరికి తెలిసిందే.. ఇక ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక చూసుకోండి.. సినిమా మాస్ మసాలాలతో వినోదాత్మకంగా ఉన్నపటికీ .. ఒక వర్గం వ్యక్తులు కావాలని ప్లాప్ ప్లాప్ అని తీవ్ర స్థాయి ప్రచారం చేసినప్పటికీ.. డివైడ్ టాక్ తో తమ సినిమా మొదటి వారం లోనే ఈ సినిమా రూ.212 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం రేపటంతో కృష్ణ, మహేష్ బాబు అభిమానులు నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అని నేడు, శుక్రవారం నాడు నిర్మాత ఎస్. నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. తప్పుడు రివ్యూ లతో ప్రచారం చేసిన వాటిని తప్పని నిరూపిస్తూ ఈ సినిమా భారీ వసూళ్లనురాబట్టింది. బయ్యర్లు అందరూ బ్రేక్ ఈవెన్ కు చేరువయ్యారు. కొందరు కావాలనే ఈ సినిమాను టార్గెట్ చేసి తప్పుడు టాక్, రివ్యూ లిచ్చారు. మహేష్ బాబు మొదటి నుంచి ఈ సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు. కొందరు కావాలని తప్పుడు టాక్ స్ప్రెడ్ చేసిన ఆయన భయపడలేదు.. ఆయన అంచన నిజమైంది అన్నారు.
