సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్ లిస్ట్ ఫైనల్ అయ్యింది. ఓటర్ల తుది జాబితాను అధికారులు భీమవరం జిల్లా కలెక్టరేట్ లో తాజగా విడుదల చేశారు. గత అక్టోబరులో విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 14,47,509 మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా ప్రకటించిన తుది జాబితాలో ఈ సంఖ్య మొత్తం 14,61,338 గా నిర్ధారింపబడింది. ఇక మొత్తం ఓటర్లు 14,61,338 మంది ఉండగా.. వీరిలో పురుషులు 7,16,956, మహిళలు 7,44,308, ఉన్నారు. పురుషులకన్నా జిల్లాలో 27,352 మంది అదనంగా మహిళ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *