సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, భీమవరం, యొక్క ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ద్వారా ‘చిప్ టు స్టార్టప్’ (C2S) ఇనిషియేటివ్ కింద ప్రతిష్టాత్మక పరిశోధన ప్రాజెక్ట్‌ను పొందడంలో విజయం సాధించడం పట్ల ప్రిన్సిపాల్ డా. G. శ్రీనివాసరావు గారు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే ఐదేళ్ల కాలంలో ‘మెమరీ-ఆప్టిమైజ్డ్ కో-ప్రాసెసింగ్ యూనిట్ ఫర్ ఎన్‌హాన్స్‌డ్ ఎడ్జ్ AI’ అభివృద్ధికి కళాశాలకు చెదిన ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నాయకత్వం వహిస్తుంది అనే నమ్మకాన్ని వ్యక్తపరిచారు.కృత్రిమ మేధస్సు యొక్క భవిష్యత్తును రూపొందించడంలో మరియు రోజువారీ జీవితంలో దాని ఏకీకరణలో కీలక పాత్ర పోషిస్తుందని .ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న పరిశోధకుల బృందానికి ప్రిన్సిపాల్ డాక్టర్ జి శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. శ్రీనివాసరాజు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రాజెక్ట్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ మరియు విభాగాధిపతి డాక్టర్ K. పద్మవాసవి, మరియు డాక్టర్ M.V. గణేశ్వరరావు, మరియు Dr.M.V. సుబ్బారావు,జి. చల్లారాంలు తదితరులు పాల్గొన్నారు.
