సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే ఎన్నికలలో ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు లో సీట్ల విషయం సంక్రాంతి పండుగ అవ్వగానే లెక్కతేలుస్తామన్నారు. అయితే ఇంకా కాలయాపన..ఒక ప్రక్క వైసీపీ కొంత మంది ప్రస్తుత ఎమ్మెల్యేలను, గత ఎన్నికలలో బొటాబొటి మెజారిటీతో గట్టెక్కిన వారిని వదిలేసుకొంటుంది. తమ సర్వే ఆధారంగా గెలుస్తారని భావించినవారికే..టికెట్స్ ఇచ్చేసి ఎన్నికలకు సన్నద్ధం అయిపోతుంది. అయితే ఇప్పటికి టీడీపీ జనసేన తమ అభ్యర్థుల లిస్ట్ ఖరారు అయ్యిందని చెపుతున్న అధికారికంగా ప్రకటించడం లేదు. అయితే గత సాయంత్రం పలు సోషల్ మీడియా లలో టీడీపీ జనసేన టికెట్స్ ఖరారు అయ్యాయని అచ్చేమ్ నాయుడు నిర్ధారిస్తూ విడుదల చేసిన లేఖ బాగా వైరల్ అయ్యింది. ఆ లేఖలో టీడీపీ 112 , జనసేన 63 స్థానాల్లో పోటీచేస్తాయంటూ విస్తృతం గా ప్రచారం అవుతోంది. దాంతో 50 స్థానాలు వస్తాయనుకొంటే 63 స్థానాలు ఇచ్చారని జనసేన క్యాడర్ లో జోష్ పెరిగిపోయింది. దీనితో అవాక్కయిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చె న్నాయుడు ఆ ప్రచారాన్ని తాజగా నేడు, గురువారం ఖండించారు. ఇదంతా ఫేక్ అని ఆయన కొట్టి పారేశారు. ఈ ప్రచారం ఫై టీడీపీ నేతలలో కొంత అనుమాన బీజం పడింది. జనసేన కు ఎక్కువ సీట్లు ఇప్పించాలని వైసిపి ఎందుకు భావిస్తుంది..? ఇక దీని వెనుక ఎవరు ఉన్నారు? ఇప్పటికే కాపు నేత, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య 60 సీట్లు తీసుకోవాలని పవన్‌తో చర్చించినట్టు ప్రకటించారు. మరో ప్రక్క ముద్రగడ పద్మనాభం ఇటీవల జనసేనలో తాను చేరాలంటే ముందు టీడీపీ తో పొత్తులో భాగంగా గౌరవప్రదమైన సీట్లు కనీసం 50 తీసుకొంటే బాగుంటుందని? మరి పాతిక పరక తీసుకొంటే రేపు పొత్తు అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ సీఎం పదవి ఎలా? డిమాండ్ చేస్తారని ప్రశ్నించినట్లు సమాచారం. వైసిపి నుండి టికెట్ రాక బయటకు వస్తున్నా ఎమ్మెల్యేలు కూడా జనసేన నే ఎక్కువ ఆశ్రయిస్తున్నారు. దీనిని బట్టి జనసేన టికెట్స్ కు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఎక్కువ సీట్లు కావాలని.. ఎవరో ఒక మేధావి వేసిన ప్యూహంలో భాగంగా నే ఈ జనసేన కు 63 సీట్ల కేటాయింపు ‘అస్త్రం’ అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరి రాజకీయాలలో రాణించాలంటే మరి రాజకీయమే చెయ్యాలి కదా? మరి అనుకున్నదానికంటే ఒక నాలుగు సీట్లు ఎక్కువ తీసుకోవాలి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *