సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో సంక్షేమానికి, అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేసారని, ఇందులో భాగంగా గత నాలుగున్నర ఏళ్లుగా భీమవరం నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు . రాయలం గ్రామంలో 5 కోట్ల 47 లక్షల నిధులతో నిర్మించిన సిసి రోడ్లను, డ్రైన్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నాడు నేడు కూడా భీమవరం నియోజవర్గం తన పరిపాలనలోనే పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని, ప్రస్తుతం ఇంకా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ముందుగా రాయలం గ్రామంలో ఆంజనేయస్వామి గుడి వద్ద 51 లక్షల 20 వేలతో నిర్మించే సిసి రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు.
