సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ పరిధిలో ఇటీవల కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పరచిన నూతన రోడ్లను వరుసపెట్టి ప్రారంభోత్సవాలు చేస్తున్న భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, శుక్రవారం ఆర్టీసీ డిపో ఎదురుగ 29 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్ ను ప్రారంభించారు. దశాబ్దం కాలంగా పెద్ద గుంతలు పడిన ఈ కీలకమైన రోడ్డు కు తన హయాంలో నూతన రోడ్డు గా మోక్షం కలగడం హర్షణీయం అని ఇంకా ఎన్నో రోడ్లు కోట్లాది రూపాయలతో ఆధునిక హంగులతో నిర్మిస్తున్నామని, గత నాలుగున్నర ఏళ్ళ కాలంలో ఇప్పటికే 100 కోట్ల పైగా నిధులతో పట్టణం లో రోడ్డులు , డ్రైన్స్ నిర్మించామని, అయినా తాను విశ్రమించలేదని సీఎం జగన్ సహకారం తో అన్ని వార్డులలో రోడ్డులు నిర్మాణాలు పూర్తీ చేస్తానని భీమవరం పట్టణం, నియోజకవర్గంలో అభివృద్ధి రాష్ట్రానికి ఒక రోల్ మోడల్ కావలని తన ఆశయం అన్నారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. ఈ కార్యక్రమం లో మునిసిపల్ కమిషనర్ ఎం శ్యామల , వేండ్ర వెంకట స్వామి, మేడిది జాన్సన్, తోట బోగయ్య తదితర వైసిపి నేతలు, పెద్ద ఎత్తున స్థానిక మహిళలు పాల్గొన్నారు.
