సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ‘రా కదలి రా’ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. వరుసగా 3 రోజుల పాటు ఆరు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. నేడు శనివారం పీలేరు, ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. నేటి ఉదయం విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి చంద్రబాబు తిరుపతి బయలు దేరారు. ఇక తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో పీలేరు మండలంలోని వేపులబయలుకు చంద్రబాబు వెళ్లనున్నారు. వేపులబయలు బహిరంగ సభలో ప్రసంగిoచనున్నారు. అనంతరం సాయంత్రం ఉరవకొండ బహిరంగ సభలో పాల్గొననున్నారు. రేపు (28న) నెల్లూరు రూరల్, పత్తికొండల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 29న రాజమండ్రి రూరల్, పొన్నూరులో జరగనున్న సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.. ‘రా.. కదలిరా’ పేరుతో ఈ నెలలో 12 రోజుల్లో మొత్తం 22 సభలు పూర్తీ చెయ్యాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *