సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్కసారిగా భారీగా మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. 92 మంది మున్సిపల్ కమిషనర్లను ఏపీ ప్రభుత్వం తాజగా బదిలీ చేసింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన జీవోను స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి జారీ చేశారు. ఎన్నికల వేళ ఎన్నికల ప్రక్రియతో నేరుగా సంబంధం ఉన్న అధికారుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లకు పైగా, సొంత జిల్లాలో, ప్రమోషన్ పొంది అక్కడే పోస్టింగ్‌లలో ఉన్న మున్సిపల్ కమిషనర్ల బదిలీలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు బదిలీలు చేస్తున్నట్టు స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం 92 మంది అధికారులను బదిలీ చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ శాఖలోని అధికారుల బదిలీల కోసం ప్రత్యేక జీవో ఆర్టీ నెంబర్ 106ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.
