సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వం సకాలంలో తమకు గత 3 లేదా నాలుగు నెలల నుండి బిల్లులు చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్న కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు గత గురువారం నుంచి సమ్మె బాట పట్టిన నేపథ్యంలో వారు తమ ఆసుపత్రులలో రోగులకు సేవలు నిలిపివేయడంతో తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 15 ఆసుపత్రులకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. దీనిపై జిల్లా వైద్య అధికారులు ..ఒప్పందంలో బిల్లు లు సకాలంలో ఇస్తామని, ఆరోగ్యశ్రీ అధికారులు మాత్రం సమస్య పరిష్కారం అవుతుందని, ఇప్పటికే ఎన్నో కోట్ల రూపాయలు పాత బకాయిలు చెల్లించామని చెబుతున్నారు .ప్రభుత్వం డీఎంహెచ్వో ద్వారా ఆసుపత్రుల లో ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభించాలని రోగులను ఇబ్బంది పెట్టవద్దని ఆపరేషన్స్ వాయిదా వెయ్యవద్దని ప్రవేటు ఆసుపత్రులకు విజ్ఞప్తి చేస్తుంది.
