సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన టీడీపీ కూటమిలో సీట్ల పంపకంలో లుకలుకలు ఇంకా తగ్గలేదు. సీట్లకు అభ్యర్థుల ను ప్రకటించడంలో ఇప్పటికే చాల ఆలస్యం జరిగిపోతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు కదలి రా సభల్లో ఇద్దరు తమ అభ్యర్థులను ప్రకటిస్తే దానికి ప్రతిగా తన పార్టీ తరఫున రెండు సీట్లను కూడా ప్రకటించేసి.. మిత్ర ధర్మం పాటించాలని, తనకు టీడీపీ వారు చేసిన అవమానాలు గుర్తున్నాయని, టీడీపీని హెచ్చరించి జనసేన అధినేత పవన్ తాజగా ఢిల్లీ లో బీజేపీ తో చర్చలకు వెళ్లడం మరో ఆసక్తి పరిణామం.. వైసిపి పెద్దలు అయితే ఇది టీడీపీ జనసేన ఆడుతున్న మరో గేమ్ అని తేలిగ్గా కొట్టి పారేస్తుంటే.. నిజానికి జనసేన పార్టీ పెట్టిన తరువాత పవన్ తొలిసారి అత్యంత వేగంగా రాజకీయ ప్యూహం అమలు చేస్తూ తన పావులు కదుపుతున్నారు అని అర్హం అవుతుంది. ఒక ప్రక్క చిరంజీవి అర్హతను గుర్తించి దేశంలోనే అచ్యుత్తమ 2వ పురస్కారం ‘పద్మవిభూషణ్’ ఇచ్చి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గౌరవించింది. అయితే ఇదే సమయంలో ఢిల్లీ టూర్ లో తమకుటమితో బీజేపీ తో పొత్తు ను పవన్ పైనల్ చేస్తారా? లేదా బీజేపీ పెద్దల మాటలు విని టీడీపీ కి పవన్ దూరం అవుతారా? అనే మిలియన్ డాలర్స్ ప్రశ్న పవన్ తాజా వైఖరితో టీడీపీ పెద్దలను వేధిస్తుంది. ఇరుపార్టీల పొత్తుకు సీట్లు తెగటం లేదు.. ఒకవేళ బీజేపీ కలసి వస్తే ప్రచారంలో ఉన్నట్లు వారికీ కూడా 5 లోక్ సభ, 5 అసెంబ్లీ సీట్లు ఎక్కడ సమర్పించుకోవాలో టీడీపీ కి అర్ధం కావడం లేదు. ఏది ఏమైనా పవన్ ఢిల్లీ టూర్ అయ్యాక తమతో బీజేపీ వచ్చేది రానిది తేలిపోతే సీట్లు కోటా ప్రకటించెయ్యవచ్చు నని రాజకీయ విశ్లేషకుల వాదన.. ఇదిలా ఉండగా పవన్ సోదరుడు నాగబాబు ట్విటర్ లో పెడుతున్న వరుస ట్విట్స్ టీడీపీ లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. న్యూటన్ మూడు సిద్ధాంతాలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీటిలో ప్రధానంగా ‘ చర్యకు ప్రతిచర్య ‘ఉంటుందని.. న్యూటన్ మూడో సిద్ధాంతం టీడీపీని హెచ్చరించడానికే అని, జనసేనాని తాజా దూకుడు నేపద్ద్యంలో విశ్లేషకులు భావిస్తున్నారు... సిగ్మా ప్రసాద్ కాలమ్స్
