సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం నుంచి అనాకోడేరు వరకు సుమారు 7 కిలోమీటర్ల వరకు కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలిగింపు ప్రక్రియను నేడు శనివారం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ప్రారంభించారు. ఎన్నో గ్రామాలను కలుపుకుని వెళ్లే ఈ కాలువకు పనులను త్వరితిగతిన పూర్తి చేయాలని, కాలువలో పెరిగిన గుర్రపు డెక్క తొలిగింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఆయా గ్రామాల రైతులు, కూటమి నాయకులు, పాల్గొన్నారు.
