సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ స్టార్ మహేష్ బాబు కు బావ గా గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామిక వేత్థ గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికలలో పోటీ చెయ్యడం లేదని, తెలుగు దేశం పార్టీ తో పాటు తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని బిజినెస్ ఫై ద్రుష్టి పెడతానని నేడు, ఆదివారం సంచలన ప్రకటన చేసారు. నిజానికి గత ఏడాదిగా టీడీపీ తో ఎంపీ జయదేవ్ అంటి ముట్టనట్లుగానే ఉంటున్నారు. లోకేష్ పాదయాత్రలో కూడా పాల్గొనలేదు. ఆయన మాట్లాడుతూ..ఏ పార్టీ అయిన సరే.. ఈ రాజకీయాలు తన నిబ్బద్దత ను తనను మార్చలేవని, వీలయితే రాజకీయాలను తాను మారుస్తానని .. . నిజాయతీ గల వారు రాజకీయాల్లోకి వచ్చిన మౌనంగా ఉండటం తప్ప ఇక్కడ ఏం చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. అటు కేంద్రం ప్రభుత్వం ఇటు , రాష్ట్ర ప్రభుత్వంతో ఇబ్బంది అని మౌనంగా ఉండలేను, మరోసారి నేను గెలిచిన కూడా ఇబ్బందులు తప్పవు అందుకే ఇక రాజకీయాలకు దూరం అంటూ రాజకీయాలకు వీడ్కోలు చెప్పేందుకు గుంటూరులో ఆత్మీయ విందు ఏర్పాటు చేశానన్నారు. విచిత్రం ఏమిటంటే.. గత 2019 ఎన్నికలలో వైసీపీ గాలికి ఎదురువెళ్ళి అతి కష్టం మీద అతి స్వల్ప మెజారిటీ తో గెలిచిన కేవలం ముగ్గురు ఎంపీలలో 2024 ఎన్నికలు వచ్చేనాటికి ఇద్దరు టీడీపీ దూరం కావడం..
