సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని మరియు పంచారామ క్షేతం లోని శ్రీ సోమేశ్వర స్వామి వారిని రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ కమిషనర్, ఎస్ సత్యనారాయణ I A S వారు ఆలయ మర్యాదలతో దర్శించుకొన్నారు. శ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించారు, వేదపారాయనుదారులు వేద ఆశీర్వచనం అందచేసినారు. ఈ కార్యక్రమంలో దేవదాయ ధర్మదాయ శాఖ D C. (విజయరాజు) పాల్గొన్నారు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు ధర్మకర్తలు ముత్యాల రామారావు, రామాయణం సత్యనారాయణ, చెల్లంగి శేషగిరి, మరియు ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి యర్రంశెట్టి భద్రాజీ పాల్గొని శేషవస్త్రం ప్రసాదాలు అందజేశారు.తదుపరి శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగిన కార్యక్రమం నందు సహాయ కమీషనరు, వై.భద్రాజీ, తనిఖీదారు, వి.వెంకటేశ్వర రావు, మరియు దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులైన కూర్మదాసు సత్య శ్రీనివాస్, నాచు శ్రీవల్లి, లక్కు త్రిమూర్తులు, నల్లం రఘుబాబు, చెల్లబోయిన సూర్యప్రకాష్, సోమాదుల లీలా ఈశ్వరి, తాణాల రామకృష్ణ , తదితరులు పాల్గొన్నారు. .
