సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహేష్ బాబు హీరోగా జగపతిబాబు ప్రధానపాత్రలో దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో అద్భుతంగా తెరకెక్కిన సినిమా‘శ్రీమంతుడు’ 2015లో వచ్చిన ఈ మూవీ బాక్సా ఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నాన్ బాహుబలి రికార్డ్స్ ను నమోదు చేసింది. అయితే, ఈ సినిమా కథ విషయం లో చాల కాలంగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీం కోర్టులోనూ దర్శకుడు కొరటాల శివకు షాక్ ఇచ్చింది. గతంలో ఈ సినిమా కధ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు ల ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందేనని నేడు, సోమవారం సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. ‘శ్రీమంతుడు’ స్టోరీని స్వాతి వార పత్రికలో ప్రచురించిన తన కథ ఆధారంగా దర్శకుడు కొరటాల శివ దొంగిలించి సినిమా తీసి బుకాయిస్తున్నారని ఆధారాలు సన్నివేశాలు తో సహా.. రచయిత శరత్ చంద్ర గతంలో హైదరాబాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ఫై విచారణ జరిపిన కోర్టు దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ, కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు.. నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించింది. దీంతో కొరటాల శివ రచయిత తో రాజీచేసుకోవడం మానివేసి మరోసారి సుప్రీం కోర్టు కు వెళ్లారు. అక్కడ కూడా తాజగా ఇదే తీర్పు రావడం తో ప్రస్తుతం దేవరా సినిమా షూటింగ్ లో ఉన్న దర్శకుడు కొరటాల ఏ విధంగా స్వాందిస్తారో చూడాలి.. దేశంలో ఎందరికో స్ఫూర్తిగా నిలచిన శ్రీమంతుడు సినిమా కధ చౌర్యం చేశాడన్న అపవాదు కొరటాలకు ఆఖరికి మిగిలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *