సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రైలు రిజర్వేషన్ చేసుకొనే ప్రయాణికులకు ఒక తాజా షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. ఇటీవల రైలులో ప్రయాణికుల రిజర్వే షన్ వివరాలను ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)లు హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్ (ట్యాబ్స్ లాగా ఉంటుంది. ఫై చిత్రంలో చూడవచ్చు) ) ద్వారా పరిశీలిస్తున్నారు. దానితో ఓ స్టేషన్లో రిజర్వేషన్ చేసుకున్న వారుఅక్కడ రైలు ఎక్క కపోతే.. తర్వా త స్టేషన్ వచ్చే లోపు ఆర్ఏసీ, వెయింటింగ్ లిస్ట్ లో ఉన్న వారికి ఆటోమేటిక్ గా ఆ బెర్త్లు కేటాయించే అవకాశం ఉంది. దీంతో తర్వాత స్టేషన్లో రైలెక్కి టీసీ ని పట్టుకొని నా బెర్త్ ఏదీ? అని అడిగేందుకు ప్రయాణికులకు హక్కు లేదు. . గతంలో టీటీఈలకు ప్రింటెడ్ రిజర్వేషన్ ప్రయాణికుల జాబితా చార్ట్ ఇచ్చేవారు. దీంతో ఒకటి, రెండు స్టేషన్ల వరకు ప్రయాణికులు రాకపోయినా టీసీ లు వేచి చూసేవారు. ఇప్పుడు అటువంటి అవకాశం లేదు. ఇకపై వచ్చే స్టేషన్లో రైలు ఎక్కాలనుకుంటే.. ముందుగా ఆ ప్రయాణికులు బోర్డిం గ్ వివరాలు మార్చుకోవాల్సి ఉంటుంది.
