సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరి కొద్దీ రోజులలో రానున్న ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి కి చెందిన అభ్యర్థుల లిస్ట్ ఇప్పటిదాకా అధికారికంగా విడుదల కాలేదు. అయితే జనసేన తరపున పోటీ చేసే 18 మంది అభ్యర్థులకు గత డిసెంబర్ లోనే వారి స్థానాలలో ప్రచారానికి సంకేతాలు అందాయి. ఇంకా మిగతా వారి లిస్ట్ రావాల్సి ఉంది. అయితే తమ కూటమిలోకి బీజేపీ ని ఆహ్వానించడానికి జనసేనాని చేస్తున్న ప్రయత్నాలు తాజా పరిణామాల దృష్ట్యా ఫలించేలా కనపడటం లేదు. ఇక ఆఖరిమాటగా ఢిల్లీ వెళ్లి వారితో చర్చలు జరుపుదామని భావించిన పవన్ కళ్యాణ్ కు ఇంకా అవకాశం రాలేదు. వచ్చే లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో కూడా బీజేపీ ఒంటరిగా బరిలో దిగుతుంది. బీహార్లో మారిన రాజకీయాల నేపథ్యంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వాటిపై ద్రుష్టి పెట్టారు. అయితే ఏపీలో బీజేపీ ఒంటరిగానే బరిలోకి వస్తుందని సంకేతాలు వస్తున్నాయి. ఇక జనసేన అభ్యర్థులు క్యాడర్ ఆశిస్తున్నట్లు కనీసం 50-45 స్థానాలు అయిన పొత్తులో భాగంగా టీడీపీ కేటాయించక పొతే క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తప్పేలా లేవు.. ఏది ఏమైనా వచ్చే ఫిబ్రవరి నెల మొదటి వారంలో సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం కచ్చితంగా ఉంది. సీట్ల సర్దుబాటుపై ముచ్చటగా మూడోసారి టీడీపీ అధినేత చంద్రబాబు- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు – పవన్ ప్రస్తుతం హైదరాబాదులోనే ఉన్నారు.
