సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో చాల మంది వ్యక్తులు తమ సమస్యలు సాధనకు సెల్ టవర్ లు ఎక్కి ఒకటి రెండు రోజులు హడావిడి చేసి తమ డిమాండ్స్ ను నెరవేర్చుకోవడం చాల సార్లు చూసాం.. అయితే బహుశా గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు లో నమోదు చేసే అంశం ఇటీవల లోకం ఏసు అనే వ్యక్తి సాధించాడు. తన తండ్రి ఇన్సూరెన్స్ (సుమారు 20 లక్షల డబ్బు) పత్రాలు బ్యాంకు వారు తనకు ఇవ్వడం లేదని దానికి నిరసనగా .. భీమవరంలోని చినమీరం ప్రాంతంలో ఈనెల 18వ తేదీన ఒక సెల్ టవర్ ఎక్కి ఏకంగా గత 11 రోజులుగా తిండి నీరు లేకుండా నిరసన దీక్ష చేస్తున్న లోకం ఏసు దీక్షనువిరమించాడు. అతన్ని జాగ్రత్తగా కిందకు దించేందుకు అధికారులు ప్రయత్నాలు చేశారు. ఆఖరికి ఆర్డీఓ కె.శ్రీనివాసులరాజు, డీఎస్పీ బి.శ్రీనాథ్, సమస్య పరిష్కా రానికి హామీ ఇవ్వడం తో ఏసు టవర్ దిగి వచ్చి దీక్షను విరమించాడు. జిల్లా అగ్ని మాపక అధికారి కె.శ్రీనివాస్, తహసీల్దార్ వై.రవికుమార్ అతనికి నిమ్మరసం ఇచ్చి బంధువులకు అప్పగించారు. అధికారులు అతనిని హాస్పటల్ కు తీసుకొనివెళదామని ఎంత చెప్పినప్పటికీ లోకం ఏసు తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఇంటికి వెళ్లి పోతానని ఉత్సహపడటం తో అధికారులు ఆవాక్కయారు. ఒక యోగిలా ఉన్న లోకం ఏసు 11 రోజులు సెల్ టవర్ ఫై దీక్ష చేసాడంటే అతని కార్యదీక్ష సంకల్ప బలం ఎటువంటిదో అర్ధం అవుతుంది.అయితే ఇటువంటి నిరసనలు ప్రోత్సహించకూడదు..
