సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దక్షిణ మధ్య రైల్వే తాజాగా విడుదల చేసిన ప్రకటనలో 23 ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పొడిగించింది. వీటిలో ఉభయ గోదావరి జిల్లాల మీదుగా ప్రయాణించే రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. (08579) విశాఖపట్టణం – సికింద్రాబాద్ ప్రతి బుధవారం ఫిబ్రవరి 7నుంచి మార్చి 27 వరకు పొడిగింపు. (08580) సికింద్రాబాద్–విశాఖపట్టణం ప్రతి గురువారం ఫిబ్రవరి 8 నుంచి మార్చి 28 వరకు, (08583) విశాఖపట్టణం–తిరుపతి ప్రతి సోమవారం ఫిబ్రవరి 5 నుంచి మార్చి 25 వరకు, (08584) తిరుపతి–విశాఖపట్టణం ప్రతి మంగళవారం ఫిబ్రవరి 6 నుంచి మార్చి 26 వరకు, (08543) విశాఖపట్టణం–ఎస్ఎంవీటీ బెంగళూరు ప్రతి ఆదివారం ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు, (08544) ఎస్ఎంవీటీ బెంగుళూరు–విశాఖపట్టణం ప్రతి సోమవారం ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 1 వరకు, (02809) భువనేశ్వర్–తిరుపతి ప్రతి శనివారం ఫిబ్రవరి 3 నుంచి మార్చి 30 వరకు, (02810) తిరుపతి–భువనేశ్వర్ ప్రతి ఆదివారం ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు,పొడిగించారు.
