సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ఏపీ రాజ్యసభ కోటాలో ముగ్గురు వైసిపి అభ్యర్థులు నామినేషన్స్ వేశారు. అభ్యర్థి ని గెలిపించుకోవడానికి కావలసిన 45 ఎమ్మెల్యేల బలంలో సగం కూడా లేకపోవడంతో , వచ్చే ఎన్నికలలో టికెట్ రాని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల నుండి ఆశించిన మద్దతు రాకపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు తమ రాజ్యసభ ఎన్నికలలో తమ అభ్యర్థి పోటీ విరమించుకోనట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాజ్యసభ లో ఇప్పటికే 9 మంది ఎంపీల బలం ఉన్న వైసిపి ఏప్రిల్ నెల 2 నుండి మరో ముగ్గురు అభ్యర్థులతో 12 సభ్యుల బలం పెంచుకోనుంది. దురదృష్టవ శాత్తు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక 41 ఏళ్లలో తొలిసారి రాజ్య సభలో టీడీపీ ప్రాతినిధ్యం ఈసారి లేకపోవడం గమనార్హం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *