సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో రాబోయే విద్యా సంవత్సరంలో ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నేడు, బుధవారం సాయంత్రం విడుదల చేసింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష AP EAPCETను మే 13 నుంచి 19వరకు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ఈసెట్, ఐసెట్, ఎడ్సెట్ సహా మరో ఎనిమిది ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేసింది. 2024- 25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఏపీ ఈఏపీసెట్ – మే 13 నుంచి 19 వరకు ఆంధ్ర – జేఎన్టీయూ కాకినాడ వారు ఏర్పాట్లు చేస్తున్నారు.
