సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమిత్ షా తో చంద్రబాబు ఢిల్లీలో సమావేశం అయ్యి వారంరోజులు దాటిపోతున్న 100+ 50+ 25 నిష్పత్తి లో? ఏపీలో సీట్ల పంపిణి.. బీజేపీ కి 7 లోక్ సభ సీట్లు అడిగారు అన్న విషయం తప్ప జనసేన టీడీపీ కూటమి లో బీజేపీ చేరుతుందా? లేదా ఇంకా బయటకి తేలలేదు. అయితే నేడు, శుక్రవారం మంచి రోజు కావడంతో .. బీజేపీ రాకపోయిన… కూటమి సీట్లు కూడా చంద్రబాబు ,పవన్ సంయుక్తంగా ప్రకటిస్తారని టీడీపీ జనసేన నేతలు కొండంత ఆశతో ఎదురు చూసారు. వారికీ నిరాశ ఎదురయ్యింది. ఇక చంద్రబాబు దేవుడి మీద భారంవేసి శ్రీ రాజ్య శ్యామల యాగంలో కూర్చున్నారు.. అయితే ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబును అమిత్‌షా సీట్ల విషయమై 25 కు 7 ఎంపీ సీట్ల కు తగ్గేది లేదని గట్టిగా డిమాండ్ చేశారని అయితే తాజా పరిణామాలలో కనీసం బీజేపీ 20 సీట్లు ఇస్తే పొత్తు కొలిక్కి వస్తుందని ఆ సీట్లు విషయం కూడా చంద్ర బాబు ఇంకా తేల్చకపోవడం వల్లే కూటమి ప్రకటన ఆలస్యం అవుతుందని కీలక బీజేపీ నేతలు అనధికారికంగా మీడియా తో చెబుతున్నారు. తమ బీజేపీ కి కావలసిన స్థానాల లిస్ట్ కూడా చంద్రబాబు ఇచ్చామని ఆ లిస్టులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, ఏలూరు లోక్ సభ స్థానాలు తో పాటు ఏలూరు, తాడేపల్లి గూడెం అసెంబ్లీ స్థానాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇలా జరిగితే అటు జనసేనకు ఉమ్మడి పశ్చిమ జిల్లాలో సగం సీట్లు ఇచ్చి , బీజేపీకి మరో 2 అసెంబ్లీ సీట్లు తో పాటు జిల్లాలో ఉన్న 2 లోక్ సభ స్థానాలు బీజేపీకి ఇచ్చేస్తే.. ఇక టీడీపీ కి ఒకప్పటి కంచుకోట పశ్చిమలో పూర్తిగా ప్రాబల్యం వదులుకున్నట్లే కదా?
