సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, శుక్రవారం వీరవాసరం మండలం లోను, ఉత్తర పాలెం గ్రామంలో సుమారుగా రెండు కోట్ల 12 లక్షల నిధులతో నిర్మించిన పలు నిర్మాణాలు ప్రారంభోత్సవాలు తో పాటు పలు అభివృద్ధి పనులను, ఆయన నేడు, శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. ముందుగా 43 లక్షల 60 వేల నిధులతో వీరవాసరం ఎల్లమ్మ చెరువు వద్ద నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని , 23 లక్షల 94 వేల నిధులతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, 40 లక్షల నిధులతో నిర్మించిన సంత మార్కెట్ షెడ్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం వీరవాసరం పెదపేటలో 60 లక్షల నిధులతో నిర్మించే సిసి డ్రెన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తదనంతరం ఉత్తర పాలెం గ్రామంలో 43 లక్షల 60వేల తో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. సచివాలయ నిర్మాణానికి 43 లక్షల అరవై వేల నిధులను ఖర్చు చేస్తే, ఈ సచివాలయ భవన నిర్మాణానికి సెంటు 10 లక్షలు పలికే ఏడు సెంట్లు భూమిని ఇచ్చిన దాతలు చెన్ను సత్యనారాయణ, కోడి వీరన్న, సిహెచ్ వెంకట సత్యనారాయణ, కోడి అప్పారావు, పులి మురళీకృష్ణ లను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. తన హయాంలో ప్రతి గ్రామంలో కూడా సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను చేపట్టడం జరిగిందని, ఇప్పటికే పలు గ్రామాలలో పనులు పూర్తి కావడం జరిగింది అన్నారు. జలజీవన్ మిషన్ పథకంలో ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేసేందుకు పైపు లైన్ కూడా వేయడం జరిగింది అన్నారు. 2019 ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చారని అన్నారు.
