సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయముగా మార్కెట్ లో రొయ్యలకు డిమాండ్ పెరిగి ఇటీవల భీమవరం జోన్ లో గత నెల రోజులుగా రొయ్యల ధరలు పెరిగి ఇటు రైతుకు అటు ఏజెన్సీలు మరల కాస్త లాభాల బాట పట్టారు అనుకుంటున్నా నేపథ్యంలో గత 6 రోజులుగా మరల రొయ్యల ధరలు తగ్గిపోతూ రావడం ఆక్వా రైతు లలో ఆందోళన కలిగిస్తుంది. ఒక్కసారిగా కిలోకు 30 – 40 రూపాయలు వరకు రేటు పడిపోవడం ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని రెండు రోజులుగా ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొయ్య రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత బుధవారం భీమవరంలో సమావేశం నిర్వహించారు. ధర తగ్గడంపై ట్రేడర్ల లను వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఈనెల 12వ తేదీన ఒక్కసారిగా రొయ్యల ధరలు ఆకస్మికంగా తగ్గిపోయాయని నిర్ధారించారు. ఆ రోజు ఉదయం 30 కౌంటు రొయ్యలు 480 రూపాయలు పలికింది.. కొన్ని గంటల్లోనే అది 40 రూపాయలు తగ్గి 440 వద్ద ఆగింది. ఒక్కసారిగా ఎందుకు రేటు తగ్గించి కొంటున్నారని దీనిపై రొయ్యల కొనుగోలు దారులు వివరణ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. . గతంలో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మార్కెట్లో రొయ్యలు ధరలు స్థిరంగా కొన సాగాలని, రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఒక కమిటీ నియమించి గతేడాది ప్రభుత్వం కొన్నిరూల్స్ జారీ చేసింది. వంద కౌంటు రొయ్య రూ.240 తగ్గకుండా కొనసాగాలని ఆదేశాలిచ్చారు. అయితే 200 రూపాయలు కూడా కొంటున్నారు . ఈ నేపథ్యంలో రొయ్య రైతుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జీకేఎఫ్ సుబ్బరాజు ప్రభుత్వ అధికారుల దృష్టికి ఈ సమస్య నివేదించి పరిష్కారం కోరతామని అన్నారు.
