సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, శనివారం భీమవరంపట్టణం 21వ వార్డులో స్థానిక శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ గుడి వద్ద నుండి వెంకటేశ్వర బుక్ డిపో వరకు 40 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన బీ.టి రోడ్ ప్రారంభించారు. దీనితో శ్రీ మావుళ్ళమ్మవారి గుడికి నలువైపులా మరియు టౌన్ హాలువరకు నూతన రోడ్డులు ఏర్పాటు అయ్యాయి. ఈ కార్యక్రమంలో పట్టణ వైసిపి ప్రెసిడెంట్ తోట భోగయ్య, కామన నాగేశ్వరరావు, కోడె యుగంధర్,మానేపల్లి నాగన్న, గుంటి ప్రభు. కురిశెట్టి కాశీ, జంగం మాణిక్యాలరావు. గంటా సుందర్ కుమార్ , నల్లం రాంబాబు,శ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
