సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నేడు, శనివారం జరిపిన GSLV F-14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సరిగ్గా నేటి సాయంత్రం 5.35 గంటలకి నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్18 నుంచి 19 నిమిషాల ప్రయాణం చేస్తూ ఇన్ శాడ్ త్రీడీఎస్ శాటిలైట్ ని మోసుకెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని భూమికి 253.53 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి వాతావరణ అధ్యయనానికి సంబంధించిన GSLV-F14 శాటిలైట్‌ను జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఇన్‌శాట్ 3డీఎస్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపించారు. ఈ ప్రయోగానికి ఇవాళ నేటి మధ్యాహ్నం 2గంటల 5నిమిషాలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ ఏడాది రెండో ప్రయోగం రెండో వేదిక నుంచి జరగడం అది విజయవంతం కావడం గమనార్హం.. దీనిపై సీఎం జగన్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు
