సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి సోమవారం జిల్లా స్థాయి స్వాందన కార్యక్రమం గతంలో పోలీస్ ఎస్పీ యు.రవిప్రకాష్ ఉన్నపుడు భీమవరం లోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించేవారు. అయితే ప్రజలకు మరింత దగ్గర కావడం కోసం కొత్తగా ఇటీవల బాధ్యతలు తీసుకొన్న జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ప్రతి వారానికి ఒక సబ్ డివిజన్ పరిధిలో స్వాందన నిర్వ హించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే భీమవరం సబ్ డివిజన్ పరిధిలోని భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోను , నరసాపురం సబ్ డివిజన్ కు సంబంధించి నరసాపురం రూరల్ కార్యాలయాల్లోనిర్వహించారు.ఇక వచ్చే సోమవారం తాడేపల్లిగూడెం సబ్డివిజన్ పరిధిలోని తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ ఇన్సపెక్టర్ కార్యాలయం లో జిల్లాస్థాయి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. వినతులు ఇచ్చేందుకు వచ్చిన వృ ద్ధుల కు ఎస్పీ అజిత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *