సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రం వాసవి శాంతిథామ్ నందు పంచమ వార్షికోత్సవ మహోత్సవాల్లో నేడు, మంగళవారం ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని శ్రీ అమ్మవారి స్వర్ణ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భముగా ఆమెకు అఖిల భారత పెనుగొండ ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ గోవిందరాజులు, ఆర్యవైశ్య ప్రముఖులు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వాసవి మాతకు బంగారు కిరీటం ఆవిష్కరణ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మాజీ మంత్రి స్థానిక శాసన సభ్యులు చెరుకువాడ రంగనాథరాజు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో పితాని సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ గాంధీ, తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు. శ్రీ వాసవి మాత మహిళా చైతన్యానికి, శక్తికి స్ఫూర్తి అని ఆమె త్యాగనిరతి దేశానికీ ఆదర్శమని...గతం నుండి మన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లో( కోడలు) ఉన్నపుడు ఆలయాన్ని సందర్శించానని అయితే ఇటీవల కాలంలో ఆలయాన్ని చాల పెద్ద ఎత్తున అభివృద్ధి చేసారని నిర్వాహకులను ఆమె ప్రశంసించారు.
