సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికలు సమీపిస్తున్న వేళా ఎన్నికల కోడ్ దగ్గర పడుతున్న వేళా.. ప్రధాని నరేంద్ర మోడీ..నేడు, మంగళవారం ఉదయం జమ్మూ కశ్మీర్ నుండి దేశ వ్యాప్తంగా విద్య, రైల్వే, విమానయానం, రవాణ రంగంలో రూ.32వేల కోట్ల వ్యయంతో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చేపట్టారు. అలాగే కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర విద్యాసంస్థల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విశాఖ క్యాంపస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. విశాఖకు మణిహారంగా నిలిచే ఐఐఎం శాశ్వత భవన నిర్మాణాలను రెండు దశల్లో చేపట్టారు. మొదటి విడతలో ఫ్యాకల్టీ బ్లాక్‌, పరిపాలన భవనంతోపాటు, విద్యార్థులకు వసతి గృహ నిర్మాణాలు పూర్తి చేశారు. ఇక్కడ 15 వందల కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్‌ ప్లాంటును అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా ఏడాదికి 22.59 లక్షల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తికానుంది ఇక తిరుపతిలో ఐఐటీ, కర్నూలులో ఐఐటీ, హైదరాబాద్​లో ఐఐటీని వర్చువల్ గా ప్రారంభించి.. జాతికి అంకితమిచ్చారు.తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ శాశ్వత భవానలను కూడా వర్చువల్‌గా ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *