సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం తాడేపల్లి సీఎం వో కార్యాలయంలో సీఎం, జగన్ బటన్ నొక్కి’ కల్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా’ నిధులను విడుదల చేశారు. సీఎం జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో నామమాత్రం గా ఉన్న పథకాన్ని తాము బాగు చేశామని, దాదాపు 10,132 మంది జంటలకు, పిల్లలకు ఈరోజు మంచి జరుగుతుందని, కళ్యాణమస్తు, , వైయస్సార్ షాదీ తోఫా కార్యక్రమం ప్రతి పేదవాడికీ పిల్లలను చదివించే విషయంలో ప్రోత్సహిస్తూ కచ్చితంగా పదో తరగతి సర్టిఫికెట్ ఇద్దరికీ ఉండాలని నిబంధన విధించామని, ఈ పథకంలో కనీస అర్హత కచ్చితంగా తమ పిల్లల చదువును ప్రోత్సాహిస్తుం దన్నారు. కుటుంబం భవిష్య త్తు తలరాత మారాలంటే మం చి చదువులే కుటుంబానికి ఆస్తిగా మారుతాయని అన్నారు.
