సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం ఉదయం హెలిఫ్యాక్టర్ లో భీమవరం కే కన్వర్షన్ హాలు దగ్గరకు చేరుకొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన జిల్లా అడ్జక్షులు కొటికలపూడి గోవిందబాబు తో కలసి స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ జిల్లా అడ్జక్షురాలు , మాజీ ఎంపీ తోట సీతారామ లక్ష్మి నివాస గృహానికి చేరుకొని ఆమెతో జనసేన , టీడీపీ పొత్తులో భాగం గా ఇరుపార్టీల నేతలు కలసి పనిచేయాలని , భీమవరం నుండి జనసేన అభ్యర్థిగా తాను మరోసారి బరిలో దిగుతున్నానని మీ సహకారం కూడా కావాలని అభ్యర్ధించారు. దానికి ఆమె సానుకూలంగా స్వాదించారు. టీడీపీ జనసేన కలసి ఈ ఎన్నికలలో అధికారం హస్తగతం చేసుకొనేలా మంచి ఫలితాలు సాధించేలా కృషి చేద్దామని తోట సీతారామ లక్ష్మి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు మంతెన రామరాజు, నిమ్మల రామానాయుడు తో పాటు మాజీ ఎమెల్య కలవపూడి శివ , మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తదుపరి పవన్ కళ్యాణ్ స్థానిక బ్యాంకు కాలనిలో ఉంటున్న టీడీపీ మాజీ ఎమెల్య పులపర్తి అంజిబాబు నివాసానికి వెళ్లి ( ఆయన భీమవరం టీడీపీ టికెట్ ఆశిస్త్తున్నారు ) ఆయన మద్దతు కూడా తనకు కావాలని పవన్ కళ్యాణ్ అభ్యర్ధించారు. పవన్ పర్యటన నేపథ్యంలో పట్టణం అంతటా పవన్ అభిమానులతో కోలాహలంగా ఉంది. హెలీకాఫ్టర్ దిగినప్పటి నుండి పవన్ కారును పవన్ అభిమానులు బైకులపై అనుసరిస్తూ సందడి చేస్తునారు .
